సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి(నాని) గారు అన్నారు. సోమవారం మీడియా తో మాట్లాడుతూ గత నాలుగు, ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మురికి కాలువలు దగ్గర వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కావున అన్ని గ్రామాల్లోని పంచాయతీ అధికారులు, సచివాలయ, వాలంటరీ ఉద్యోగులు ఎప్పటికప్పుడు పరిశుభ్రత పనులు చేపట్టాలి అంతే కాకుండా వ్యక్తిగత శుభ్రత కూడా ఎంతో అవసరమన్నారు. ప్రజారోగ్యంకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఆయా వాలంటరీ వారి పరిధిలోని ప్రజల ఆరోగ్య స్థితి గతులను ఎప్పటికప్పుడు అధికారులు తెలియజేయాలి.

నియోజకవర్గంలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో మాట్లాడి ప్రతి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందేలా చూడాలని కోరారు. కోవిడ్ 19 రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు రాకూడదని దీనికి తోడు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల సూచనలు తప్పకుండా పాటించి కరోనాను తరిమికొట్టాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హోం హైసోలేషన్ లో ఉన్న వారికి ఇంటి దగ్గరకే అవసరమైన మందులను సరఫరా చేస్తుందన్నారు. దీనికి తోడు భారీ వర్షాల కారణంగా అన్నీ మండలాల్లోని పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here