అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అభివృద్ది, సంక్షేమంలో దూసుకువెళుతున్నఏపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఫుల్, ప్రతిపక్షం మద్దతు నిల్ లా తయారైంది పరిస్థితి. చివరకు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలకు అండగా నిలవాల్సిందిపోయి, చంద్రబాబు తన నిజనైజాన్ని బయటపెడుతున్నారు. ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒక్క గొంతు వినిపిస్తుంటే, రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఆరునెలలుగా హైదరాబాద్ లో బతుకుతున్న బాబు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. రాయలసీమ ప్రజల తాగు, సాగు నీటి కష్టాలను తీర్చటంతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పనికివచ్చే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒక రకంగా తెలంగాణకు మద్దతుగా, ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏవైనా లోటుపాట్లుంటే చెప్పాలి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి కళ్లల్లో నిప్పులు, కాళ్లల్లో కర్రలు పెట్టినట్లుగా వ్యవహించటం బాబుకే చెల్లిందనే విమర్శలు వస్తున్నాయి.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంతో సహా రాజకీయ పార్టీలన్నీ ఒక్కటైన పరిస్థితి. దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతుంటే ఏపిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ లాంటి పార్టీలు ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగానైనా ప్రాజెక్ట్ ఆపాలనే ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అందరూ ఐక్యం అయితే ఏపిలో ప్రభుత్వాన్ని అందరూ కలిసి ఒంటరిగా చేశారు. రాయలసీమ ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నాయి ఏపీ ప్రతిపక్షాలు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు వెన్నుపోటు ఖాయం అనే ధోరణి బాబు కొనసాగిస్తూనే ఉన్నారు. సొంత రాష్ట్రానికి ముఖ్యంగా సొంత ప్రాంతానికి నష్టం చేకూర్చేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు వంతపాడుతూ సిపీఐ, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా అదే బాటలో నడుస్తుంటే, ఇక పచ్చమీడియా అయితే వాళ్ళు చెప్పిందే నిజం అని ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తోంది.

పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ సమస్యలను పరిష్కరించు కోవాలని తెలంగాణ సీఎం కేసీయార్ ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించే సమయంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అప్పటి వరకు ఉన్న సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయ్యింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

తాజాగా ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలతో చర్చలు జరిపి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై సాగునీటితో పాటు ఇతర వివాదాలు పరిష్కరించుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఇది నచ్చని చంద్రబాబు, వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉంటే తమకు రాజకీయంగా పబ్బం గడవదని భావించారు. రాష్ట్రానికి ప్రయాజనం చేకూర్చే రాయలసీమ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం, కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇతర ప్రతిపక్షాలూ వారికి గొంతు కలిపాయి. ఇప్పుడు వీళ్లకు చంద్రబాబు జత కలిశారు. తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రాజెక్ట్ ని చంద్రబాబు వివాదంలోకి లాగారు. ఈ పథకం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం అంటూనే మరో పక్క ఆ ప్రాజెక్ట్ కు గండి కొట్టేందుకు సిద్ధం అయ్యారు. తనతో పాటు తనకు వంతపాడే సి పీ ఐ, కాంగ్రెస్, బీజెపిలోని తన అనుకూల వర్గం నేతలను రంగంలోకి దించి ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. నిద్రలో కూడా గుడ్డిగా బాబు భజన చేసే ఎల్లో మీడియా ఇప్పుడు కూడా అదే వంతపాడుతోంది. వెనుకబడిన రాయలసీమకు మంచి జరుగుతుందన్న కనీస సృహను మరిచి బాబు తందా అంటే తందాన అంటోంది ఓ పక్షం వహించే మీడియా.

ఏపి ప్రభుత్వం రాయయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మే లో ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సిఎం వారం రోజుల క్రితం వరకు నోరు మెదపలేదు. టీఆర్ఎస్ నేతలు కూడా స్పందించలేదు. రాజకీయ ప్రయోజనాలతో ఇటు చంద్రబాబు అండ్ కో, తెలంగాణాలో విపక్షాలన్నీ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో, ఎట్టకేలకు కేసీయార్ స్పందించారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ చర్యలను అడ్డుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టిన జగన్ ను అభినందిచక పోయినా, కనీసం నష్టం కలిగించేలా వ్యహరించకుండా చంద్రబాబు ఉండాల్సిందనే అభిప్రాయం ఏపీ ప్రజలు, నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here