వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఓ వైసీపీ డిజిటల్ మీడియా చీఫ్ దేవేందర్ రెడ్డి గట్టి షాకిచ్చారు. సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణం రాజు బండారం బయటపెట్టాడు. ఈ క్రమంలోనే ఈ వైసీపీ డిజిటల్ మీడియా చీఫ్ దేవేందర్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. ఒక ఎంపీపై అవాకులు చెవాకులు పేలిన అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

దీంతో దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి సోషల్ మీడియాలోనే ఎంపీ రఘురామకృష్ణం రాజు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడది వైరల్ గా మారింది.

దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ.. ఎంపీ రఘురామకు అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా రాదు అంటూ ఎద్దేవా చేశారు. ‘సీఎం జగన్ గారి దాయా దాక్షిణ్యాల మీద ఎంపీగా గెలిచిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు గారూ… మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని గారు అనే వ్యక్తి ‘మహిళా అధికారి’ సార్… అసలు సార్ కి మేడం కి తేడా తెలియకుండా ఫిర్యాదు లేఖలో మేడంను పట్టుకొని సార్ అంటూ సంభోదించారని కడిగిపారేశారు. మీరు ఎంపీ ఎలా అయ్యారు సార్… బహుశా కాపీ… పేస్ట్ లో ఎక్కడో తేడా వచ్చి ఉంటుంది సారూ అంటూ ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆ తేడా మీదగ్గరే వచ్చిందో.. లేక మీకు పంపించిన వాళ్ల దగ్గర వచ్చిందో సరిచూసుకోగలరు అంటూ కౌంటర్ విసిరారు..

అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ మీద గెలిచిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు అనే ఎంపీ లెటర్ హెడ్ లో జాతీయ పదవిని పేర్కొనడం సిగ్గుచేటు అని దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి విమర్శించారు.

ఇక రఘురామ టీడీపీతో కలిసి ఆడుతున్న నాటకాన్ని కూడా దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి ఎండగట్టారు. ‘టీడీపీ కాంగ్రెస్ నీచపు కూటమికే మేము భయపడలేదు. ఈరోజు మీకూ ,మీ చంద్రబాబుకి , పచ్చ మీడియాకు ఎలా భయపడతాం అనుకుంటున్నారంటూ’ ప్రశ్నించారు. మీలాంటి వాళ్ళ ఉడతూపులకి ఏ ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త భయపడడు అని సవాల్ చేశారు. మా పార్టీ మీద,మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద అవాకులు చవాకులు పేలే అద్దె గొంతులకు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్దతిలో మేము సమాధానం చెపుదామని సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేశారు. ఎంపీ రాసిన లేఖలో ప్రస్తావించిన ‘అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్య’ అంటే ఏంటో చెప్పాలని దేవందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఎంపీ రఘురామకు సవాల్ చేసిన వైసీపీ డిజిటల్ మీడియా చీఫ్ దేవేందర్ రెడ్డి గుర్రంపాటి పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఎంపీ రఘురామను ఎదురిస్తున్న దేవేంద్ర రెడ్డి ఎవరో కాదు.. వైసీపీ డిజిటిల్ మీడియా చీఫ్. ఎంతో మంది టీడీపీ వలంటీర్స్ ని తన వ్యాఖ్యల ధాటితో సైడ్ చేశారు. పార్టీ సోషల్ మీడియా వలంటీర్స్ కి అండగా ఉన్నాడు. అందరితో కోఆర్డినేట్ చేస్తూ వైసీపీ తరుఫున పోరాడుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here