కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామంలో ఈరోజు
శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు
నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి గారు
ప్రముఖ వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీ కర్రా హర్ష వర్ధన్ రెడ్డి గారు
నంది రైతు సమాఖ్య సభ్యులు
ఉయ్యాలవాడ కోయిలకుంట్ల మండల కుందు పరివాహక ప్రాంత రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు
రెండు సంవత్సరాల నుండి కుందు నది ద్వారా సోమశిల ప్రాజెక్టుకు నీరు పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల నంద్యాల పార్లమెంటరీ ప్రాంతంలో కుందు పరివాహక ప్రాంతం వెంబడి రైతుల పంట పొలాలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళటానికి గౌరవ ఎమ్మెల్యేలందరూ కుందు నది వెంట తిరిగి గ్రామ ప్రజల యొక్క పంటనష్టాన్ని తెలుసుకొని, కుందు నది వెంట ప్రహరీ గోడ ఏర్పాటు చేయటానికి, బ్రిడ్జిల నిర్మాణం ఏర్పాట్లు, చెక్ డాం నిర్మాణాల ఏర్పాటు,
పాలేరు వాగు ద్వారా జరిగే నష్టం
మన్నే వాగు ద్వారా జరిగే నష్టం
గార్ల వాగు ద్వారా జరిగే
పంట నష్టం గురించి అంచనాలు వేశారు రైతుల సలహాలు తీసుకున్నారు. ప్రభుత్వం నుండి మంచి జరుగుతుందని ఆశిద్దాం.
2019 లో కుందు నది ద్వారా జరిగిన పంట నష్టానికి కోటి పది లక్షల రూపాయలు ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే సెనగ రైతులకు కూడా పదిహేను వందల రూపాయలు జమ చేయడం జరిగింది. భవిష్యత్తులో అనంతపురం అమరావతి రోడ్డు నిర్మాణం విషయంలో కూడా ప్రభుత్వ అధికారులు, గౌరవ ఎమ్మెల్యేలందరూ సహకరించాలని ప్రజలు కోరుతున్నారు

[vc_images_carousel images=”543,544,545,546,547,548,549,550,551,552,553,554,555″ img_size=”full” autoplay=”yes” wrap=”yes”]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here