విశాఖలో కరోనా వార్డును తనిఖీ చేసిన విజయసాయిరెడ్డి
పిపిఈ కిట్‌ ధరించి కరోనా వార్డులోకి వెళ్లిన ఎం.పి
కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా
వార్డులోని కరోనా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎం.పి
ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన విజయసాయిరెడ్డి

విశాఖలో కరోనా బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్స్‌, వైరాలజీ ల్యాబ్‌, కేజీహెచ్‌ హాస్పిటల్‌ను వెస్‌ఆర్‌సీపీ ఎం.పి విజయసాయిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విశాఖలోని KGH హాస్పిటల్‌లో కరోనా బాధితులకు అందుతున్న సేవలను స్వయంగా తెలుసుకునేందుకు కరోనా వార్డులోకి వెళ్లారు. డాక్టర్లు వారించినా పి.పి.ఈ కిట్‌ ధరించి నేరుగా కరోనా రోగుల వద్దకు వెళ్లారు. ఒక్కొక్క బెడ్‌ వద్దకెళ్లి చికిత్స పొందుతున్న పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

లేనిపోని అనుమానాలు, భయాలు విడిచిపెట్టి ధైర్యంగా ఉండాలని పేషంట్లకు భరోసా కల్పించారు. రోగులకు అందిస్తున్న వైద్య చికిత్సల గురించి, ప్రస్తుతం వారి హెల్త్‌ కండీషన్‌ గురించి డాక్టర్లు విజయసాయిరెడ్డికి వివరించారు. ఆసుపత్రిలో మొత్తం ఎన్ని బెడ్స్‌ ఉన్నాయి…ఎంత మంది పేషంట్లకు చికిత్స అందిస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆక్సీజన్‌ నిల్వలు సరిపడినంత ఉందా అని అక్కడి సిబ్బందిని అడిగారు.

కరోనా పేషంట్ల బంధువులతో కూడా ఎంపి మాట్లాడారు. కరోనా బారిన పడిన ప్రజల ప్రాణాలు కాపాడ్డానికి సీఎం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తూ రోగులకు సరైన వైద్యం అందించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ఎవరికి వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వయసులో విజయసాయిరెడ్డి అంత రిస్కు తీసుకుని కరోనా వార్డులోపలికి వెళ్లి రోగులను పలకరించి వారికి ధైర్యం చెప్పడం చూసి రోగుల బంధువులు, ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here