విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఈ వినాయక చవితి పండగను కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇళ్లలోనే నిర్వహించుకోవాలని రాజంపేట శాసనసభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు, కోరారు. సిఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న ప్రగతి పథకాలుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ త్వరితగతిన పూర్తిగా నశించి ప్రజలందరూ ఆరోగ్యాలతో జీవించాలని, కరోనాపై విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మట్టి గణపతి విగ్రహాలునే వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో విరజిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా నియోజక వర్గ ప్రజలుకు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.