విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఈ వినాయక చవితి పండగను కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇళ్లలోనే నిర్వహించుకోవాలని రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు కోరారు. సిఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న ప్రగతి పథకాలుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ త్వరితగతిన పూర్తిగా నశించి ప్రజలందరూ ఆరోగ్యాలుతో జీవించాలని, కరోనాపై విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మట్టి గణపతి విగ్రహాలునే వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో విరజిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలుకు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.