కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం వినాయకచవితి పండుగ వాతావరణం పై నిబంధనలు విడుదల చేసింది.ప్రతి ఒక్కరు ఇంట్లో నే వినాయకుని ప్రతిమ పెట్టుకొని పూజించుకోవాలి.పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి సామాజిక బాధ్యత..
బావి తరాలవారికి మంచి ప్రకృతి ని అందించాలని అందుకోసమే పర్యావరణం కలుషితం కాకుండా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్లాస్ట్రాఫ్ పారిస్ తో చేసిన వినాయక ప్రతిమలను ఎవ్వరు వినియోగించవదద్దు.అందరం కలసికట్టుగా ఆ విధమైన ప్రతిమలను కొనుగోలు చేయకుంటే తయారు చేసేవాళ్ళు కూడా ఇక తయారీ నిలిపివేస్తారు.వారు ఉపాధి విధానం కూడా మార్చుకుంటారు.హరిత (పసుపుతో) వినాయకుని కూడా కళాకారులు చేయవచ్చు..
ఈ హరిత వినాయకుని వలనమన ఇంటి దగ్గరే నిమజ్జనం చేసి ఆ నీటిని మన ఇంటి పరిసరాల్లో పిచికారీ చేసుకోవచ్చు..కోవిడ్ నేపథ్యంలో మనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.ప్రజలు సహకరించాలనివిజ్ఞప్తి..
ప్రజలకు ,ప్రజాప్రతినిధులకు,కర్షకులకు,శ్రామికులకు,పార్టీకార్యకర్తలకు,నాయకులకు,అధికారులకు,సిబ్బందికి ,ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలవారికి,స్వచ్ఛంద సంఘాలవారికి,ప్రాణాలకు తెగించి కోవిడ్ విధులు నిర్వహిస్తున్నవారికి ,పాత్రికేయుల కు ,వారి కుటుంబసభ్యులకు ,ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా
యాజమాన్యాలకు,అందరికి పేరు, పేరున
వినాయకచవితి శుభాకాంక్షలు